Saturday, October 17, 2015

విదుర నీతి

విదురనీతి
దృతరాష్ట్రుడు " నిద్ర పట్టటం లేదు ఎమైనా మంచి వాక్యాలు చెప్పు" అడిగిన దానికి విదురుడు ఇచ్చిన బదులు విదురనీతిగా ప్రసిద్ధి పొందింది.

  • మనిషి తనను లోకులు నిందించే పని చేయక , లోక హితమైన కార్యాలు చేయాలి.
  • పరుల సంకు ఈర్ష్యపడక నలుగురితో కలిసి మెలిసి బ్రతకాలి.
  • కోపం, పొగడ్తలకు పొంగి పోవడం , గర్వించడం, ఎంత ఉన్న అసంతృప్తి, దురభిమానం, ఏపనీ చేయక పోవడం దుర్జనుల లక్షణం...
  • తనను పాలించే రాజును , లోకాన్నిరక్షించే భగవంతుని, కట్టుకున్న భార్యను, బంధువులను సముచితంగా ఆదరించక పోతే ఏ కార్యం సత్ఫలితాన్ని ఇవ్వదు.
  • అవివేకులు తమను ప్రేమించే వారిని వదిలి ద్వేషించే వారి వెంట పడతారు. ఎదుటి వాడు బలవంతుడని తెలిసినా వారిని హింసిస్తాడు.
  • ధనము, విద్య,వంశము మంచి వారికి గౌరవాన్ని అణుకుకువను కలిగిస్తే చెడ్డవారికి మదాన్ని గర్వాన్ని కలిగిస్తుంది.
  • ఒకని బాణం శత్రువును నిర్జించ వచ్చూ లేక తప్పి పోవచ్చు కాని ఒకని నీతి శత్రువును నాశనం చేస్తుంది.
  • తాను ఒక్కడే తినడమూ, అందరూ నిద్రిస్తున్నప్పుడు ఒక్కడే ఆలోచించడం , ఒంటరిగా ప్రయాణం చేయడమూ మంచిది కాదు.
  • లోకంలో సత్యానికి మించిన మంచి గుణం లేదు...
  • క్షమాగుణాన్ని చేతగాని గుణంగా భావిస్తారు కాని దానికి మించిన ధర్మం లేదు.
  • పరుషవాక్యములు మాట్లాడక పోవడం, పాపపు పనులు చేయక పోవడం వలన మనిషి ఉత్తముడు అవుతాడు.
  • బలవంతుడై శాంతంగా ఉండే వాడు, పేద వాడైనా దానం చేసే వాడు పుణ్యపురుషుడు అనిపించు కుంటాడు.
  • న్యాయార్జితమైన ధనాన్ని అర్హులకు ఇవ్వక పోవడమూ అనర్హులకు ఇవ్వడమూ వలన కీడు కలుగుతుంది.
  • పరస్త్రీ వ్యామోహం, మద్యపానం, వేటాడటం, పరుషభాషణ, వృధాగా ధనమును ఖర్చు చేయడమూ, పోట్లాడటమూ సప్త వ్యసనాలని విజ్ఞులు చెప్తారు. కనుక వారు వాటి జోలికి పోరు.
  • తనకు ఉచితమైన దుస్తులు ధరించడమూ, ఆత్మ స్తుతి చేయక పోవడమూ, దానిమిచ్చి పిదప చింతించక ఉండుట, కష్ట కాలంలో కూడా ధర్మ మార్గాన్ని విడనాడక ఉండుట మంచి నడవడి అనిపించుకుంటుంది.
  • స్నేహం, మాటలు, పోట్లాట తనకు సమానులతో చేయాలి కాని అల్పులతోను అధికులతోను కాదు.
  • తనకు ఉన్నంతలో ఇతరులకు ఇవ్వాలి, శత్రువనా కోరిన సహాయం చేయాలి.
  • ఎక్కువగా కష్టపడి తక్కువగా సుఖపడాలి.
  • మంచి వారు పొగడ్తలకు మేలు చేస్తారు కాని కీడు చేయరు. 




నేను చెప్పిన లక్షణాలు ధర్మజునిలో ఉన్నాయి. నీవు వారిని ఆదరించి ఇప్పుడు నిరాదరణకు గురి చేసావు. వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి వారిని ఆదరించడం నీ ధర్మం. మీరు కలసి ఉన్నంత కాలం దేవతలు కూడా మీ వంక కన్నెత్తి చూడలేరు " అన్నాడు.

విదురుని మాటలు విన్న దృతరాష్ట్రుడు " విదురా? నన్ను ఇప్పుడు ఏమి చేయమంటావు " అని అడిగాడు. విదురుడు " అలా అడిగితే నేను ఏమి చెప్పను? రాజ్యం దక్కింది కదా అని తమ్ముని రాజ్యం కాజేయాలని చూసావు. చేపతో సహా గాలం కూడా మింగిన చందాన ఉంది నువ్వు చేస్తున్న పని.

  • పక్వానికి రాక మునుపే పండును కోసిన రుచిగా ఉండక పోవడమే కాక దాని విత్తనం తన ప్రయోజనాన్ని కోల్పోతుంది.
  • పరుల ధనానికి, విద్యకు, పరాక్రమానికి ఈర్ష్య చెందే వాడు ఏరోగం లేక పోయినా బాధ పడక తప్పదు.
  • ఎదుటి వానికి ప్రియం కలిగించేలా మాట్లాడలేక పోయిన ఊరక ఉండటం మంచిది.
  • మాటల వలననే పగ, చెలిమి, తెలివి, కలత, ధర్మము, పాపము, కీత్రి, అపకీర్తి కలుగుతాయి.
  • గొడ్డలితో నరికిన చెట్టు కూడా చిగురిస్తుంది కాని మాటలతో చెడిన కార్యం సిద్ధించదు.
  • మనసుకు తగిలిన గాయం మాన్పవచ్చు కాని శరీరానికి తగిలిన గాయం మాన్పలేము.

ధర్మరాజు నోటి వెంట ఒక చెడు మాట కూడా రాదు కాని నీ కుమారులు నీచపు మాటలు నీకు తెలియనివా?
  • చేటు కాలం దాపురించిన చెడ్డ మాటలు కూడా తీయగా ఉంటాయి. దుష్టులు చేసే దుర్మార్గం కూడా బాగానే ఉంటుంది. కాని మనసుకు అవి తగని పనులని తెలుసు.
ధర్మ నిరతుడైన ధర్మరాజు తన సంపదకు దూరం కావడం ధర్మమా? అతడు నీ పెద్దరికాన్ని గౌరవిస్తున్నాడు కాని నీవు పాండవుల విరోధం కోరుతున్నావు.ఎన్ని పుణ్య కార్యాలు చేసినా అవి ధర్మవర్తనకు సరి రావు. ఉత్తముడు లంభించిన కీర్తి ఇహ లోకంలో ఉన్నంత కాలం అతడు పరలోకంలో పుణ్యగతులు పొందగలడు. పూర్వం ప్రహ్లాదుడు రాక్షస కులంలో జన్మించినా ధర్మ మార్గం తప్పక అంగీరసునికి తన కుమారునికి వచ్చిన వివాదంలో పక్షపాత రహితంగా అంగీరసుని పక్షాన న్యాయం చెప్పాడు. కనుక నీవు కూడా నీ కుమారుల పట్ల పక్షవాతం వదిలి ఇరువుకి సంధి చెయ్యి. అందు వలన అందరూ సుఖపడతారు.
  • పెద్దలు లేని సభ సభ కాదు, న్యాయం మాటాడలేని వారు పెద్దలు కారు, సత్యం లేని ధర్మం ధర్మం కాదు, ఏదో ఒక మిష మీద చెప్పేది సత్యము కాదు. నీతి మార్గంలో నడవడం ఉత్తమం, శౌర్యంతో సంపదలు పొందుట మద్యమము, భారంగా బ్రతుకు లాగుట అధమం. నీతి దూరులను ఉత్తములు మెచ్చరు.
నీ పుత్రులు ఎప్పుడూ నీతి మాలిన కార్యాలను మాత్రమే చేస్తారు. యుద్ధోన్మాదంలో ఉరకలు వేస్తుంటారు. దానికి కర్ణుడు అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ప్రోస్త హిస్తుంటాడు. నీకేమో నీతి పట్టదు. పాండవులు కయ్యానికి కాలు దువ్వరు; కయ్యానికి పిలిచిన వారిని వదలరు. పాడవులు నిన్ను తండ్రి మాదిరి గౌరవిస్తున్నారు నీవు అలాగే వారిని కన్న కొడుకులుగా చూడటం మంచిది.
  • మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు.
నీ తమ్ముడు పాండు రాజు నీకు పరమ భక్తుడు, పాండవులు నీకెంతో మేలు చేసారు. వారిని ఆదరించడం మంచిది.
  • ప్రతి మనిషికి సుఖ దుఃఖాలు సహజం. దుఃఖించడం వలన శక్తి నశిస్తుంది, మతి చెడుతుంది, శరీరం కృశిస్తుంది, రోగం వస్తుంది శత్రువుకు అది బలాన్ని చేకూరుస్తుంది కనుక దు॰ఖించడంమాను " అన్నాడు.
దృతరాష్ట్రుడు " విదురా! నేను ధర్మతనయుని నా మాటలతో చేతలతో బాధించాను. అందు వలన నా కుమారులకు మరణం తధ్యం. నేను దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. విదురుడు " రాజా! నీవు లోభం విడిచి మనసు అదుపులో పెట్టుకుంటే మనశ్శాంతి అదే లభిస్తుంది . జ్ఞాతి వైరం వదిలి పెట్టు. గోవులను, బ్రాహ్మణులను అగౌరవ పరచ వద్దు.
  • అన్నదమ్ములు కలిసి ఉండేలా చూడు. ఒక్క చెట్టును కూల్చడం తేలిక అదే అనేక చెట్లు ఒకటిగా ఉండగా పెను గాలి కూడా వాటిని కూల్చ లేదు.
పాండు పుత్రులను పిలిచి వారికి హితం కలిగించి నీ పుత్రులను బ్రతికించుకో. జూదం ఆడిన నాడే నేను వద్దని చెప్పాను నీవు విన లేదు. కాకుల వంటి నీ కుమారులను నమ్మి నెమళ్ళ వంటి పాండవులను వదులుకుని ఇప్పుడు తల్లడిల్లి పోతున్నావు. కుల నాశకుడైన కుమారుని వదిలితే వచ్చే నష్టం ఏమిటి. భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు, పాండుపుత్రులు సుయోధనాది పుత్రులు మనుమలైన లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు నిన్ను సేవిస్తుంటే నీ వైభవం ఎలా ఉంటుంది. శత్రు రహితమైన ఆ వైభవంతో సాటి ఏమి ? " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీవు చెప్పిన మాటలు బాగున్నా నా కుమారులను వదల లేను కనుక ధర్మం జయిస్తుంది " అన్నాడు. విదురుడు " రాజా! నీవు నీ కుమారులను వదల వద్దు పండవులను దూరం చేసుకోవద్దని మాత్రమే నేను చెప్తున్నాను. నీ కుమారులను ఒప్పించి పాండవులకు ఐదు ఊళ్ళైనా ఇప్పించు.ఉద్ధం నివారించడానికి కొడుకులను వదల మన్నాను కాని సంధి చేసుకుంటే అందరికీ క్షేమమే కదా!
  • ఎన్ని భోగాలు అనుభవించినా మహారాజులకైనా చావు తప్పదు.
కనుక నీకొడుకులను సంంధికి ఒప్పించు ధర్మరాజును శాంత పరచు " అన్నాడు. దృతరాష్ట్రుడు " విదురా! నీ మాటలు బాగున్నాయి. అలాగే చేస్తాను " అన్నాడు.విద్రుడు " ఆ మాట మీద ఉండు దుర్యోధనుని చూసి మనసు మార్చుకోకుండా ధర్మరాజుతో సంధి చేసుకో " అని చెప్పి తన మందిరానికి వెళ్ళాడు..
Source: Someone shared on  Facebook 

Thursday, December 11, 2014

10 Things To Learn From Sri Narendra Modi.

10 Things To Learn From Sri Narendra Modi

by Nandini Sharma

1) Public Speaking Skills
The man has something in his voice that makes head turn. Even the people who don't happen to like him have agreed that they never miss a speech by the Indian Prime Minister. And we can't even say that this all is because of someone who writes his speeches, as the Independence Day saw him speaking without any written speeches, and this sure is going to be one of the most remembered speeches from an Indian PM.

2) Discipline
The 15th Prime Minister of India has always led a disciplined life. Ever since he was made abalswayamsevak in RSS, which is known to instill discipline in all its members, he has followed a disciplined regimen.

3) Determination
Ever since he was a child who used to help his father and brother in their tea stalls, he was determined to make it big for himself. He has been associated with RSS since an early age, and that shows the determination that eight-year old possessed and this 64 year old possesses.

4) Detailing
This is something for people who plan a lot. Learning from a meticulous planner that Mr. Modi is, you should care to have a love for detailing. For reaching out to the Indian population, Modi traveled more than 3.5 lakhs Kms and did 400 rallies, even to places where no one usually goes. This micro detailing helps a lot in efficient planning, leading to better results.

5) Love For Technology
The man is tech-savvy and likes to keep himself up to date with all the developments in the field. He tweets and posts important details of his life and journey within minutes of it happening. Even as I write this article, I can see that his Facebook cover picture has already been updated. While we can learn from this, we should also know the clear difference there is between love for technology and being a slave for it.

6) Love For Fitness
Modi is a big yoga enthusiast and never forgets to do it, no matter how busy he is. Perhaps, this is the reason why he is this active at this age. This is also something that we can and should learn from him.

7) Enthusiasm
Even at the age of 64, the enthusiasm with which Narendra Modi lives his life is commendable. Be it playing drums on his recent visit to Japan or answering questions of various Indian students on Teacher's Day, he has never left his enthusiastic persona.

8) Patience
After foolproof planning, which leads to his confidence, he is not a man who can be impatient and jump on to conclusions or be restless for results. This patience and the tendency of keeping his calm and not behaving like a kid has proved to be very useful for him. It's a hard sight to see the man angry, overpowered by emotions, or losing his patience. This is something which if learned can prove to be a changing point in our lives.

9) Leadership Skills
If you remember well, he promised to work one hour more than his subordinates did in a public speech. This is not something an inefficient leader would be able to say. He is an efficient leader and leads by his words; learning this skill from him can be beneficial for our professional lives.

10) Humbleness
Even though he is the Prime Minister of world's largest democracy, his position has not gone to his head. He comes across as a very humble human being and this is evident by the way he addresses the nation and answers all the questions he is put across. Being humble can take you places and this is also something to learn from him.

( Telugu version will be added soon)

Wednesday, March 28, 2012

మంతెన సత్యనారాయణరాజు అరోగ్యాలయం ప్రారంబోత్సవం.


ప్రోద్దున్నె మా టివి పెడితే మొదట వచ్చే కారక్రమం  "మీ అరోగ్యం మీ చేతిలో"

రాజుగారు చేప్పేవి వినటానికి బాగానేవున్నా, ఆచరణలో పెట్టటం కోంచం కష్టమే, అయితే ఒక్కసారి మొదలుపెడితే, మనకే ఎంతో మార్పు కనపడుతుంది.

ఇప్పుడు రాజుగారు ఈ అరోగ్యాలయం ను విజయవాడ దగ్గర స్థాపించారు. ఇది చాల మంచి అలోచన.

వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి   http://www.manthenasatyanarayanaraju.org/  

Thursday, October 27, 2011

మహర్దశ

మహర్దశ
ఒకరికి సహాయ పడితే క్షేమం.
. ఎప్పుడూ ఆనందంగాఉంటే లక్ష్మిప్రదం.
. ప్రసన్నంగా ఉంటే ఆరోగ్యం.
. పట్టుదలతోకృషి చేస్తే సంపూర్ణ విజయం.
. తృప్తి వుంటే నిత్య యవ్వనం.
. నవ్వుతూ వుంటే దివ్య సౌందర్యం.
. చక్కని దుస్తులు ధరిస్తే తేజస్సు.
. మథురంగా మాట్లాడితే మంగళకరం.
. మితంగా భుజిస్తే చక్కని రూపం.
. సువర్ణా భరణాలను ధరిస్తే ఆయుర్వృద్ది.

విఘ్నేశ్వర.


శుక్లాంబరధరమ్ విష్నుమ్, శశివర్ణం చతుర్భుజమ్
ఫ్రసన్నవదనమ్ ధ్యాయెత్, సర్వ విఘ్నొపశాంతయే.